america: అమెరికా జాతీయ భద్రతా సలహాదారును తప్పిస్తూ ట్రంప్ షాకింగ్ నిర్ణయం
- జాతీయ భద్రతా సలహాదారు బోల్డన్కు ఉద్వాసన
- ఆయన సేవలు ఇక చాలని చెప్పానన్న ట్రంప్
- వచ్చే వారం కొత్త జాతీయ భద్రతా సలహాదారు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకున్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేస్తున్న జాన్ బోల్టన్‌ను విధుల నుంచి తప్పించారు. వైట్‌హౌస్‌లో ఆయన సేవలు ఇక అవసరం లేదని గత రాత్రే ఆయనతో చెప్పినట్టు ట్రంప్ ట్వీట్ చేశారు. ఆయన సలహాల్లో చాలా వాటిని తాను తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలిపారు. బోల్డన్ను రాజీనామా చేయమని చెప్పానని, ఉదయమే ఆయన తన రాజీనామా లేఖను తనకు ఇచ్చారని పేర్కొన్నారు. ఇన్నాళ్లూ ఆయన అందించిన సేవలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు. కొత్త జాతీయ భద్రతా సలహాదారుగా ఎవరిని నియమించేదీ వచ్చే వారం వెల్లడించనున్నట్టు ట్రంప్ తెలిపారు.