Rajasthan: ఓవర్ లోడింగ్ ఫలితం.. ట్రక్కు యజమానికి రూ.1.40 లక్షల జరిమానా!

  • రాజస్థాన్‌లో ట్రక్కు యజమానికి షాక్
  • గతంలో ఓ ట్రక్కు యజమానికి రూ.1.16 లక్షల జరిమానా
  • కొత్త చట్టం అమల్లోకి వచ్చాక ఈ స్థాయిలో జరిమానా ఇదే తొలిసారి

ఓవర్ లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కుకు పోలీసులు భారీ జరిమానా విధించారు. రాజస్థాన్‌లో ఓ ట్రక్కు ఓవర్‌ లోడింగ్‌తో వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. సామర్థ్యానికి మించిన లోడుతో వెళ్తున్నట్టు గుర్తించి సీజ్ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి ఓవర్ లోడుతో వెళ్తున్నందుకు గాను ట్రక్కు యజమానికి రోహిణి కోర్టు ఏకంగా రూ. 1,41,700 జరిమానా విధించింది. కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో జరిమానా విధించడం ఇదే తొలిసారి. గతంలో ఓ ట్రక్కు యజమానికి పోలీసులు రూ.1.16 లక్షల చలానా పంపారు. ఇప్పుడా రికార్డును తాజా ఘటన అధిగమించింది.

  • Loading...

More Telugu News