Andhra Pradesh: చింతమనేని ఇంటివద్ద హైటెన్షన్.. నేరుగా ఇంట్లోకెళ్లిన 25 మంది పోలీసులు!

  • పోలీసులను అడ్డుకున్న అనుచరులు
  • ఇరువర్గాల మధ్య వాగ్వాదం
  • చింతమనేని తండ్రిని ప్రశ్నించిన పోలీసులు

ఏపీ పోలీసులకు లొంగిపోయేందుకు తాను సిద్ధంగా ఉన్నానని దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను ఈరోజు పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ ఆఫీసు వద్దకు రాబోతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ దిలీప్ కిరణ్ నేతృత్వంలో పోలీసుల బృందం చింతమనేని ఇంటికి చేరుకుంది. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు సోదాలకు ప్రయత్నించగా, చింతమనేని అనుచరులు అడ్డుకున్నారు.

దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చింతమనేని లొంగిపోతారని చెప్పినా ఎందుకు తనిఖీలు నిర్వహిస్తున్నారని నిలదీశారు. దాదాపు గంట సేపు సోదాలు చేసిన 25 మంది పోలీసుల బృందం చింతమనేని తండ్రిని ప్రశ్నించింది. సోదాలు చేపట్టిన అనంతరం ఘటనాస్థలం నుంచి వెళ్లిపోయింది. జోసెఫ్ అనే వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు ఎస్సీ,ఎస్టీ వేధింపుల కేసు నమోదుచేయడంతో గత మూడువారాలుగా చింతమనేని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News