Frogs: వర్షాల కోసం కప్పలకు పెళ్లి... ఎక్కువయ్యాయని విడాకులు!

  • మధ్యప్రదేశ్ లోని ఇండోర్ సమీపంలో ఘటన
  • కప్పలకు శాస్త్రోక్తంగా విడాకులు
  • వర్షాలు తగ్గేందుకేనంటున్న ప్రజలు

వర్షాలు కురవాలని కోరుకుంటే, ఇండియాలోని చాలా ప్రాంతాల్లో కప్పలకు వివాహం చేస్తారన్న సంగతి తెలిసిందే. ఇక మధ్యప్రదేశ్ లో ఓ వింత ఘటన జరిగింది. కప్పలకు పెళ్లి చేసిన తరువాత వానలు ఎక్కువై ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్న భావనకు వచ్చిన ప్రజలు, అవే రెండు కప్పలను తిరిగి పట్టి తీసుకొచ్చి, వాటికి సంప్రదాయ బద్ధంగా విడాకులు ఇప్పించారు.

ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగింది. ఇక్కడి ఇంద్రపురి ప్రజలు ఇటీవల వర్షాల కోసం దేవుడిని ప్రార్థిస్తూ, కప్పలకు పెళ్లి చేశారు. ఆపై కుండపోత వర్షాలు కురిశాయి. ఈ ప్రాంతంలో సాధారణం కంటే 26 శాతం ఎక్కువ వర్షపాతం నమోదయ్యింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజా జీవితం వరదలకు అస్తవ్యస్తమైంది. దీంతో వర్షాలు ఆగిపోవాలన్న ఉద్దేశంతో శివ్ సేవా శక్తి మండల్ సభ్యులు ఆ కప్పలను తెచ్చి, వేదమంత్రాలు చదువుతూ విడాకులు ఇప్పించారు. ఇక ఇప్పటికైనా ప్రజల కోరిక మేరకు వర్షాలు తగ్గుతాయో లేదో మరి!

  • Loading...

More Telugu News