Andhra Pradesh: కొందరు నేతలు పోలీసులతో అసభ్యంగా మాట్లాడడంపై ఫిర్యాదులు వచ్చాయి: డీజీపీ గౌతమ్ సవాంగ్
- పోలీసులపై ప్రశంసలు కురిపించిన డీజీపీ
- ఛలో ఆత్మకూరు సందర్భంగా ఎంతో ఓర్పుగా వ్యవహరించారని కితాబు
- గణేశ్ నిమజ్జనాలు ముగిసేవరకు పల్నాడులో 144 సెక్షన్ అమలులో ఉంటుందని వెల్లడి
టీడీపీ చేపట్టిన ఛలో ఆత్మకూరు కార్యక్రమంపై రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. కొందరు నేతలు పోలీసులతో అసభ్యంగా మాట్లాడినట్టు తమకు ఫిర్యాదులు అందాయని, కానీ వివాదం పెద్దది కాకూడదన్న ఉద్దేశంతో సంయమనం పాటించామని తెలిపారు.
ఛలో ఆత్మకూరు సందర్భంగా పోలీసులు స్పందించిన తీరు అభినందనీయం అని డీజీపీ వ్యాఖ్యానించారు. కొందరు నేతలు తిడుతున్నా ఎంతో ఓర్పుగా వ్యవహరించారని పేర్కొన్నారు. గణేశ్ నిమజ్జనాలు ముగిసేవరకు పల్నాడులో 144 సెక్షన్ అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఆత్మకూరులో జరిగింది రెండు వర్గాల మధ్య ఘర్షణ తప్ప పార్టీలకు సంబంధంలేదని అన్నారు.