Telangana: తెలంగాణ మంత్రులకు చేదు అనుభవం.. రోడ్డుపై ఘొరావ్ చేసిన కొండగట్టు బాధితులు!

  • మంత్రుల కాన్వాయ్ ను చుట్టుముట్టి ప్రశ్నల వర్షం
  • పరిహారం చెల్లించాలనీ, ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్
  • పోలీసుల జోక్యంతో బయటపడ్డ ఎర్రబెల్లి, కొప్పుల

తెలంగాణ మంత్రులు  ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్ కు ఈరోజు చేదు అనుభవం ఎదురైంది. మంత్రులు జగిత్యాలలోని హిమ్మత్ రావు పేటకు వెళుతుండగా, వీరి కాన్వాయ్ ను కొండగట్టు బస్సు ప్రమాద బాధిత కుటుంబాలు, రైతులు అడ్డుకున్నారు. రాంసాగర్ చౌరస్తా వద్ద కాన్వాయ్ ను అడ్డుకుని రోడ్డుపై బైఠాయించారు. కొండగట్టు ప్రమాద బాధితులకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఆరు కుటుంబాలకు అందాల్సిన పరిహారం, ఇంటికో ఉద్యోగాన్ని వెంటనే ఇవ్వాలని స్పష్టం చేశారు. అదే సమయంలో రైతులు కూడా మంత్రులపై విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో మండలంలోని చెరువులు, కుంటలు నింపాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సర్దిచెప్పినా వీరు వినిపించుకోలేదు. దీంతో 15-20 నిమిషాల పాటు మంత్రులు కొండగట్టు బాధితుల మధ్య చిక్కుకుపోయారు. చివరికి పోలీసులు అక్కడకు చేరుకుని గ్రామస్తులను శాంతింపజేయడంతో మంత్రులు అక్కడి నుంచి బయలుదేరారు.

  • Loading...

More Telugu News