US Air Force: గంటకు 10,620 కిలోమీటర్ల వేగం.. హైపర్ సోనిక్ వాహనాన్ని పరీక్షించిన అమెరికా!
- న్యూమెక్సికోలో హైపర్ సోనిక్ స్లెడ్ ప్రయోగం
- 10 మైళ్ల విస్తీర్ణమున్న ట్రాక్ పై చేపట్టిన వాయుసేన
- సోషల్ మీడియాలో వీడియో విడుదల
అగ్రరాజ్యం అమెరికా మరో కీలక సాంకేతికతను అభివృద్ధి చేసింది. గంటకు 6,599 మైళ్ల వేగంతో దూసుకెళ్లే ‘హైపర్ సోనిక్ స్లెడ్’ ను విజయవంతంగా పరీక్షించింది. రైలు పట్టాలపై దూసుకెళ్లే ఈ వాహనం గంటకు10,620.06 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుంది. న్యూమెక్సికోలోని హాలోమ్యాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ లో 10 మైళ్లున్న ట్రాక్ పై ఈ పరీక్షను అమెరికా వాయుసేన విజయవంతంగా చేపట్టింది.
ఈ ప్రయోగానికి సంబంధించిన వీడియోను అమెరికా వాయుసేన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. హాలోమ్యాన్ బేస్ ను అమెరికా 1949 నుంచి తన మిలటరీ ప్రయోగాలు, పరీక్షల కోసం వాడుతోంది. ప్రపంచంలో మిలటరీపై అత్యధికంగా ఖర్చు పెట్టేది అమెరికాయే. ఆ దేశం గతేడాది ఏకంగా రూ.46 లక్షల కోట్లను సైన్యం కోసం బడ్జెట్ లో కేటాయించింది.