Nellore: చిన్న కేసు కోసం నాలుగున్నర గంటల విచారణ అవసరమా?: టీడీపీ నేత సోమిరెడ్డి
- భూ వివాదం కేసులో సోమిరెడ్డిని విచారించిన పోలీసులు
- పొలానికి సంబంధించిన పక్కా ఆధారాలు నా వద్ద ఉన్నాయి
- కావాలని చెప్పే నాపై కేసు పెట్టి ఇలా చేస్తున్నారు
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఇమిడేపల్లి భూ వివాదం కేసులో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని పోలీసులు విచారించారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఓ చిన్న కేసు కోసం నాలుగున్నర గంటలు తనను విచారణ చేశారని విమర్శించారు. 2.5 ఎకరాల పొలానికి సంబంధించిన పక్కా ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని అన్నారు. కావాలని చెప్పే తనపై కేసు నమోదు చేసి ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.