Guntur District: గుంటూరు మహిళకు అత్యంత ప్రమాదకర ‘న్యూఢిల్లీ బ్యాక్టీరియా’.. ఏపీలో తొలికేసు
- నీరసం, కామెర్లతో ఆసుపత్రిలో చేరిన ప్రమీల
- ‘ఎన్‌డీఎం-1’ సోకినట్టు గుర్తింపు
- 2011లో తెలంగాణలో గుర్తింపు
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో అత్యంత ప్రమాదకరమైన బ్యాక్టీరియాను వైద్యులు గుర్తించారు. నగరానికి చెందిన 55 ఏళ్ల పూర్ణ ప్రమీల అనే మహిళకు ‘న్యూఢిల్లీ మెటల్లో బీటా ల్యాక్టమేజ్ (ఎన్‌డీఎం-1) బ్యాక్టీరియా సోకినట్టు గుర్తించారు. నీరసం, కామెర్లు, మూత్ర సంబంధ సమస్యలతో ఈ నెల 3న ప్రమీల అరండల్‌పేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె, న్యూరోపెనిమ్ రెసిస్టెన్స్ ఎంజైమ్ కలిగిన ఎన్‌డీఎం-1 ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నట్టు నిర్ధారించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2011లో తెలంగాణ ప్రాంతంలో ఎన్‌డీఎం-1కు సంబంధించి తొలి కేసు నమోదైంది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఇది గుంటూరులో వెలుగు చూసింది.