Andhra Pradesh: సత్తెనపల్లిలో ల్యాప్ టాప్ ల చోరీ కేసు.. అజయ్ చౌదరిని అరెస్ట్ చేసిన పోలీసులు!
- 30 కంప్యూటర్లను పట్టుకెళ్లిన కోడెల శివరాం
- సహకరించిన సెంటర్ అధికారి అజయ్ చౌదరి
- కోడెల శివరాం కోసం గాలింపు ముమ్మరం
ఆంధ్రప్రదేశ్ లోని సత్తెనపల్లి గ్రామీణ నైపుణ్యాభివృద్ధి సంస్థలో 30 ల్యాప్ టాప్ లను టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరామ్ ఎత్తుకెళ్లారని కేసు నమోదైన సంగతి తెలిసిందే. స్థానిక అధికారులను బెదిరించిన శివరామ్, ఈ ల్యాప్ టాప్, సోలార్ రూఫ్ టాప్, యూపీఎస్ లను పట్టుకెళ్లారని పోలీసులు కేసు నమోదుచేశారు. తాజాగా ఈ వ్యవహారంలో శివరామ్ కు సహకరించిన స్కిల్ సెంటర్ నిర్వాహకుడు అజయ్ చౌదరిని సత్తెనపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ విషయమై స్థానిక సీఐ విజయ్ చంద్ర మాట్లాడుతూ.. సత్తెనపల్లి నైపుణ్యాభివృద్ధి సంస్థకు చెందిన 30 ల్యాప్ టాప్ లను కోడెల శివరాం తన ఆఫీసుకు తరలించుకున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. ఇందుకోసం సహకరించిన ఏ2 నిందితుడు, స్కిల్ సెంటర్ ఆఫీసర్ అజయ్ చౌదరిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. ప్రస్తుతం కోడెల శివరాం పరారీలో ఉన్నాడనీ, అతని కోసం గాలింపును ముమ్మరం చేశామని పేర్కొన్నారు.