Boat: బ్రేకింగ్ న్యూస్: 72 మందితో వెళుతున్న టూరిజం బోటు గోదావరిలో మునక
- కచ్చులూరు వద్ద మునిగిపోయిన బోటు
- లైఫ్ జాకెట్ల సాయంతో కొందరు సురక్షితం
- సంఘటన స్థలికి తరలివెళ్లిన అధికారులు, పోలీసులు
గోదావరిలో ప్రమాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు మందం వద్ద 72 మందితో ప్రయాణిస్తున్న ఓ టూరిజం బోటు మునిగిపోయింది. బోటు పాపికొండలు ప్రాంతానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బోటులో ఉన్న కొందరు లైఫ్ జాకెట్ల సాయంతో ఒడ్డుకు చేరినట్టు స్థానికుల కథనం. పోలవరం/గండిపోచమ్మ ఆలయం నుంచి బోటు బయలుదేరిన గంట సేపటి తర్వాత ఈ ఘోరం జరిగినట్టు భావిస్తున్నారు. సంఘటన స్థలికి పోలీసులు, అధికారులు తరలి వెళ్లారు.