Boat: సహాయకచర్యల్లో ‘జనసేన’ నేతలు పాల్గొనాలి: పవన్ కల్యాణ్
- ఈ ఘటనపై స్పందించిన పవన్
- చాలా బాధాకరం
- సంఘటనా స్థలానికి జనసేన నేతలు వెళ్లాలి
గోదావరిలో పర్యాటకులతో వెళ్తున్న లాంచీ మునిగిపోయిన ప్రమాద ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమని అన్నారు. సంఘటనా స్థలానికి జనసేన నేతలు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపు నిచ్చారు.
కాగా, దేవీపట్నంలోని కచ్చులూరు వద్ద గోదావరి నది ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ప్రభుత్వ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.