East Godavari District: ఆ ప్రాంతంలో పెద్ద సుడిగుండం ఉంటుంది.. డ్రైవర్లు అదుపు చేయలేకపోయారు: లాంచీ యజమాని
- కచ్చులూరు దగ్గర నీటి ప్రవాహం ప్రమాదకరంగా ఉంటుంది
- లాంచీ కెపాసిటీ 90 మంది ప్రయాణికులు
- అందులో 150 వరకు లైఫ్ జాకెట్స్ ఉన్నాయి
గోదావరిలో లాంచీ ప్రమాదానికి గురైన కచ్చులూరు దగ్గర నీటి ప్రవాహం ప్రమాదకరంగా ఉంటుందని, ఆ ప్రాంతంలో పెద్ద సుడిగుండం ఉంటుందని, డ్రైవర్లు అదుపు చేయలేకపోయారని లాంచీ యజమాని కోడిగుడ్ల వెంకటరమణ అన్నారు. ఈ ప్రమాద ఘటనపై ఆయన స్పందిస్తూ, లాంచీ కెపాసిటీ 90 మంది ప్రయాణికులు అని, అందులో 150 వరకు లైఫ్ జాకెట్స్ ఉన్నట్టు చెప్పారు. కాగా, వరద ప్రవాహం ఎక్కువగా ఉందని దేవీపట్నం పోలీసులు వారించినా సదరు లాంచీ డ్రైవర్లు మాట వినలేదని సమాచారం. లాంచీ డ్రైవర్లకు కాకినాడ పోర్టు లైసెన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.