East Godavari: లాంచీ ప్రమాద ఘటనపై మూడు వారాల్లోగా నివేదిక ఇవ్వాలి: సీఎం జగన్ ఆదేశాలు
- లాంచీ ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశం
- ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చైర్మన్ గా ప్రత్యేక కమిటీ
- 45 రోజుల్లోగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: జగన్
తూర్పుగోదావరి జిల్లాలో లాంచీ ప్రమాద ఘటనపై సీఎం జగన్ సీరియస్ గా ఉన్నారు. ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చైర్మన్ గా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా రెవెన్యూ చీఫ్ సెక్రటరీ, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ, అడిషినల్ డీజీ లా అండ్ ఆర్డర్ ఉన్నారు. ఈ ప్రమాద ఘటనపై మూడు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని, నలభై ఐదురోజుల్లోగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కాగా, లాంచీ ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేవీ హెలికాఫ్టర్లు, ఎన్డీఆర్ఎఫ్, మెరైన్, ఫైర్ బృందాలు గాలింపు చర్యలు జరుగుతున్నాయి. సంఘటనా స్థలాన్ని మంత్రి అవంతి శ్రీనివాసరావు మరోసారి పరిశీలించారు. గోదావరిలో బోట్ పెట్రోలింగ్ అవసరమని అభిప్రాయపడ్డారు. అనుమతి లేని బోట్లపై చర్యలు చేపడతామని హెచ్చరించారు.