Farooq Abdullah: ఫరూక్ అబ్దుల్లాకు షాక్.. ఆయనపై కఠినమైన పీఎస్ఏ చట్టం ప్రయోగం
- గత నెల 5 నుంచి గృహ నిర్బంధంలోనే ఫరూక్ అబ్దుల్లా
- సోమవారం పీఎస్ఏ కింద నోటీసులు జారీ
- ఆయన ఇంటిని జైలుగా ప్రకటించిన ప్రభుత్వం
జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా (81) పై కేంద్ర ప్రభుత్వం కఠినమైన ప్రజా భద్రత చట్టం (పీఎస్ఏ) ప్రయోగించింది. ఎటువంటి విచారణ లేకుండానే మూడు నుంచి 6 నెలల పాటు ఆయనను నిర్బంధించేందుకు ఈ చట్టం ఉపకరిస్తుంది. జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన ఆగస్టు 5 నుంచి ఆయన గృహ నిర్బంధంలో ఉన్నారు.
సోమవారం మధ్యాహ్నం ఆయనకు పీఎస్ఏ కింద నోటీసులు జారీ అయ్యాయి. ఆ వెంటనే శ్రీనగర్‌లో ఆయన నివసిస్తున్న ఇంటిని జైలుగా ప్రభుత్వం ప్రకటించింది. అనంతరం ఆయన ఇంటి చుట్టూ బారికేడ్లు, కంచెను ఏర్పాటు చేశారు. ఫరూక్ అబ్దుల్లా కుమారుడు ఒమర్ అబ్దుల్లా, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కూడా గత నెల నుంచీ గృహ నిర్బంధంలోనే ఉన్నారు.