ASTRA: భారత అమ్ములపొదిలో మరో ఆయుధం.. ‘అస్త్ర’ ప్రయోగం విజయవంతం!

  • పశ్చిమబెంగాల్ లో ప్రయోగించిన డీఆర్డీవో
  • సుఖోయ్-30 ద్వారా ప్రయోగం
  • 70 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించే అస్త్ర
భారత వాయుసేన(ఐఏఎఫ్) ను పటిష్టం చేసే దిశగా మరో ముందడుగు పడింది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) అభివృద్ధి చేసిన ‘అస్త్ర’ క్షిపణిని వాయుసేన విజయవంతంగా పరీక్షించింది. పశ్చిమబెంగాల్ లోని ఓ ఎయిర్ బేస్ నుంచి సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం ద్వారా దీన్ని విజయవంతంగా పరీక్షించారు.

ఈ ప్రయోగాన్ని డీఆర్డీవో, వాయుసేన ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. దీన్ని గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలపై ప్రయోగించవచ్చు. దాదాపు 70 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను అస్త్ర ఛేదించగలదు. తాజా ప్రయోగంతో భారత వాయుసేన మరింత పటిష్టం కానుంది.
ASTRA
MISSILE
DRDO
West Bengal
India
SUCCESS

More Telugu News