Chalapathi Rao: నేను ఇల్లు కట్టుకుంటే రామారావుగారు ఎంతో సంతోషపడ్డారు: చలపతిరావు

  • ఎన్టీఆర్ గారితో అనుబంధం ఎక్కువ 
  • ఆయన ముహూర్తాలు బాగా పెడతారు 
  • ఎన్టీఆర్ తన ఇంటికి వచ్చారన్న చలపతిరావు 
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో సీనియర్ నటుడు చలపతిరావు మాట్లాడుతూ, ఎన్టీ రామారావుతో తనకి గల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. "నటుడిగా నన్ను ఎన్టీ రామారావుగారు ఎంతగానో ప్రోత్సహించారు. ఆయన సినిమాల్లో వరుస అవకాశాలు ఇచ్చేవారు. ఒకే పౌరాణిక చిత్రంలో నాతో మూడు .. నాలుగు వేషాలు వేయించిన సందర్భాలు వున్నాయి.

అలా సినిమాలు చేస్తూ ఒక స్థాయికి చేరుకున్నాక, చెన్నైలో నేను ఇల్లు కట్టుకున్నాను. అప్పటికి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇల్లు కట్టిన విషయం ఆయనకి చెప్పి, గృహప్రవేశానికి మీరే ముహూర్తం పెట్టాలి అన్నాను. ముహూర్తాలు పెట్టడం రామారావుగారికి బాగా తెలుసు. ఆయన పెట్టిన ముహుర్తానికే గృహప్రవేశం జరిగింది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన మా ఇంటికి వచ్చారు. నేను ఇల్లు కట్టుకున్నందుకు ఎంతో సంతోషపడ్డారు. ఆ విషయాన్ని తన సన్నిహితులతో చెప్పి ఆనందపడ్డారు" అని చెప్పుకొచ్చారు.
Chalapathi Rao

More Telugu News