Andhra Pradesh: ‘నాడు-నేడు’ కార్యక్రమం ద్వారా మూడేళ్లలో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చేస్తాం!: ఆదిమూలపు సురేష్
- 4 రోజుల్లో టీటీడీ పాలక మండలి కొలువుదీరుతుంది
- వైవీ సుబ్బారెడ్డి దళారీ వ్యవస్థను అరికట్టారు
- ‘అమ్మఒడి’ని జనవరి నుంచి ప్రారంభిస్తాం
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి మరో నాలుగు రోజుల్లో కొలువుదీరుతుందని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తిరుమలలో దళారీ వ్యవస్థను అరికట్టారని కితాబిచ్చారు. సామాన్య భక్తులకు స్వామివారి దర్శనాన్ని సరళతరం చేశారని ప్రశంసించారు. తిరుమలలో ఈరోజు ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు.
ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘అమ్మఒడి’ పథకాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభిస్తామని ఆదిమూలపు సురేష్ చెప్పారు. ‘నాడు-నేడు’ కార్యక్రమం ద్వారా రాబోయే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు స్కూళ్లకు దీటుగా తయారుచేస్తామని ధీమా వ్యక్తం చేశారు.