KTR: ‘బతుకమ్మ’ బ్రాండ్ చీరలు మార్కెట్ లోకి తీసుకొస్తాం!: తెలంగాణ మంత్రి కేటీఆర్

  • వచ్చే ఏడాది కొత్త బ్రాండ్ తీసుకొస్తాం
  • ఈ నెల 23 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ
  • హైదరాబాద్ లో మీడియాతో కేటీఆర్

తెలంగాణ జిల్లాల్లో 1.20 కోట్ల బతుకమ్మ చీరలను అందించబోతున్నామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ నెల 23 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభిస్తామని వెల్లడించారు. హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ సీడీఎంఏ కార్యాలయంలో ఈరోజు జరిగిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ‘బతుకమ్మ’ బ్రాండ్ తో మార్కెట్ లోకి చీరలు తీసుకొస్తామని పేర్కొన్నారు.  

గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఈ చీరల పంపిణీ బాధ్యతను పర్యవేక్షిస్తారని చెప్పారు. 18 ఏళ్లు నిండి, తెల్లరేషన్ కార్డులు ఉన్న ఆడబిడ్డలందరికీ చీరలు అందిస్తామని స్పష్టం చేశారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.313 కోట్లు వెచ్చిస్తోందన్నారు. బతుకమ్మ చీరలతో నేతన్నలకు ఉపాధి కల్పిస్తున్నామని పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News