Sensex: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
- 470 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
- 135 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 15 శాతం పైగా నష్టపోయిన యస్ బ్యాంక్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. అమెరికా ఫెడ్ నిర్ణయాలు మన మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ... తదుపరి కోత ఇప్పట్లో ఉండకపోవచ్చనే సంకేతాలతో ఆసియా మార్కెట్లన్నీ నష్టాల బాట పట్టాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 470 పాయింట్లు పతనమై 36,093కు పడిపోయింది. నిఫ్టీ 135 పాయింట్లు కోల్పోయి 10,704కు దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ గెయినర్స్:
టాటా మోటార్స్ (1.85%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.87%), భారతి ఎయిర్ టెల్ (0.40%), ఏసియన్ పెయింట్స్ (0.03%).
టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-15.68%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.75%), టాటా స్టీల్ (-3.45%), ఐసీఐసీఐ బ్యాంక్ (-3.29%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-2.26%).