Secunderabad Court: బాలికపై అత్యాచారం.. పదేళ్ల జైలు శిక్ష విధించిన సికింద్రాబాద్ కోర్టు

  • 9వ తరగతి బాలికపై అత్యాచారం చేసిన ఆటోడ్రైవర్
  • పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు
  • పదేళ్ల జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా విధించిన కోర్టు

ఓ ప్రైవేట్ స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఆటో డ్రైవర్ కు సికింద్రాబాద్ కోర్టు పదేళ్ల జైలు శిక్షను విధించింది. వివరాల్లోకి వెళ్తే 2015 నుంచి ఆటో డ్రైవర్ వెంకటరాజేశ్ బాలికతో పాటు ఆమె తమ్ముడిని ప్రతి రోజు తన ఆటోలో స్కూలుకు తీసుకెళ్లేవాడు. 2016 డిసెంబర్ 14న పాఠశాల నుంచి బాలిక బాధతో ఇంటికి వచ్చింది. కడుపులో నొప్పి వస్తోందని ఏడుస్తూ తల్లికి చెప్పింది. ఏమైందని తల్లి నిలదీయగా... డ్రైవర్ అత్యాచారం చేశాడని చెప్పింది. వెంటనే బాధితురాలిని ఆసుపత్రికి తీసుకెళ్లగా... ఆమె గర్భవతి అని డాక్టర్ చెప్పారు.

ఈ నేపథ్యంలో లాలాగూడ పోలీసులకు ఆటోడ్రైవర్ పై తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద ఆటో డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును విచారించిన న్యాయస్థానం నిందితుడిని దోషిగా తేలుస్తూ పదేళ్ల జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించింది.

  • Loading...

More Telugu News