Pawan Kalyan: పవన్ ఆగ్రహానికి దిగి వచ్చిన ట్విట్టర్!

  • 400 మంది జనసేన కార్యకర్తల అకౌంట్లను బ్లాక్ చేసిన ట్విట్టర్
  • ప్రజల తరపున నిలబడితే ఖాతాలను సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించిన పవన్
  • సస్పెండ్ చేసిన ఖాతాలను పునరుద్ధరించిన ట్విట్టర్
జనసేన మద్దతుదారులకు సంబంధించిన దాదాపు 400 అకౌంట్లను ట్విట్టర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్విట్టర్ పై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిస్సహాయులైన ప్రజల తరపున నిలబడినందుకే ఈ ఖాతాలను సస్పెండ్ చేశారా? అని ట్విట్టర్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ట్విట్టర్ చర్యలను ఎలా అర్థం చేసుకోవాలని నిలదీశారు. సస్పెండ్ చేసిన ఖాతాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పవన్ రియాక్షన్ కు ట్విట్టర్ యాజమాన్యం దిగివచ్చింది. సస్పెండ్ చేసిన ఖాతాలను పునరుద్ధరించింది.

ఈ నేపథ్యంలో ట్విట్టర్ కు పవన్ ధన్యవాదాలు తెలిపారు. 'వాక్ స్వాతంత్ర్య హక్కును గౌరవించినందుకు, జనసేన కార్యకర్తల ట్విట్టర్ ఖాతాలను పునరుద్ధరించే విషయంలో వేగంగా ప్రతిస్పందించినందుకు ట్విట్టర్ కు మనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నా' అంటూ ట్వీట్ చేశారు.
Pawan Kalyan
Twitter
Janasena Followers
Accounts

More Telugu News