Andhra Pradesh: ఏపీపీఎస్సీ ఆఫీసు ముందు ‘తెలుగు యువత’ ఆందోళన.. అరెస్ట్ చేసిన పోలీసులు!

  • కాకరేపుతున్న గ్రామ సచివాలయం ఉద్యోగాల గొడవ
  • పేపర్ లీక్ అయిందని మీడియాలో వార్తలు
  • పరీక్షను మళ్లీ నిర్వహించాలని తెలుగు యువత డిమాండ్
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల నిర్వహించిన గ్రామ సచివాలయం పరీక్ష ప్రశ్నాపత్రం ముందుగానే లీకైనట్లు మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ‘తెలుగు యువత’ నేతలు, కార్యకర్తలు ఈరోజు విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఈ ప్రశ్నాపత్రం లీకైందని ఆరోపించారు. కాబట్టి వెంటనే పరీక్షలను రద్దుచేసి మళ్లీ కొత్తగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మం, ఇతర కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అనంతరం రాజ్ భవన్ సమీపంలోని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ కు వారిని తరలించారు.
Andhra Pradesh
APPSC
Grama sachivalayam
Paper leakage
TNSF
FIGHT

More Telugu News