Peddireddy: ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు పేపర్ లీక్ ఆరోపణలు చేస్తున్నారు: మంత్రి పెద్దిరెడ్డి
- పేపర్ లీక్ అంటూ మీడియాలో కథనాలు
- అంతా వట్టిదేనన్న ఏపీ మంత్రి
- ప్రశ్నాపత్రాలు బయటికి వచ్చే అవకాశమే లేదని స్పష్టీకరణ
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల పరీక్ష పేపర్లు ముందే లీకయ్యాయంటూ వస్తున్న కథనాల పట్ల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ప్రశ్నాపత్రాలు బయటికి వచ్చే అవకాశమే లేదని, ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే పేపర్ లీక్ అని, స్కాం అని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సచివాలయ ఉద్యోగాల నియామక పరీక్షలను పూర్తిగా పారదర్శకంగా, కట్టుదిట్టంగా నిర్వహించామని చెప్పారు. ఈ పరీక్ష ఫలితాలు నిన్న విడుదల కాగా, పేపర్ లీక్ అని, ఉద్యోగాలను అమ్ముకున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి. వాటి ఆధారంగా టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రభుత్వాన్ని ఘాటుగా స్పందించారు.