Venkaiah Naidu: ఏదో ఒక భాషను బలవంతంగా ప్రజలపై రుద్దడం సరికాదు: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- హిందీ దేశభాష కావాలన్న అమిత్ షా
- ప్రజలు హిందీ నేర్చుకోవాలని పిలుపు
- స్పందించిన వెంకయ్య!
హిందీ దేశభాష కావాలని, ప్రతి ఒక్కరూ హిందీ నేర్చుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగొలుపుతున్నాయి. ప్రజలు ఎక్కువ భాషలు నేర్చుకోవడం మంచిదేనని, కానీ ఏదో ఒక భాషను బలవంతంగా ప్రజలపై రుద్దాలనుకోవడం సరికాదని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. అదే సమయంలో మరో భాషను కూడా వ్యతిరేకించడం చేయకూడదని హితవు పలికారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది.