Bhanupriya: సీనియర్ నటి భానుప్రియపై బాలకార్మిక చట్టం కింద కేసు నమోదు.. ఏ క్షణమైనా అరెస్ట్?

  • ఇంటి పని కోసం బాలికను నియమించుకున్న నటి
  • అమ్మాయిపై గతంలో చోరీ కేసు పెట్టిన భానుప్రియ
  • కేసును చెన్నైకి బదలాయించిన సామర్లకోట పోలీసులు

ఇంటి పనికోసం బాలికను నియమించుకున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ నటి భానుప్రియపై చెన్నైలో కేసు నమోదైంది. చెన్నైలోని ఓ ఫ్లాట్‌లో నివసిస్తున్న భానుప్రియ ఇంటి పనికోసం ఏపీలోని సామర్లకోటకు చెందిన బాలికను నియమించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఈ విషయమై సామర్లకోట పోలీసులు భానుప్రియపై కేసు నమోదు చేశారు. ఇప్పుడా కేసు చెన్నై పోలీసులకు బదిలీ అయింది.

ఈ ఏడాది జనవరి 19న చెన్నైలోని పాండిబజార్ పోలీసులకు నటి భానుప్రియ, ఆమె సోదరుడు గోపాలకృష్ణన్ ఫిర్యాదు చేస్తూ.. తమ ఇంట్లోని పని అమ్మాయి చోరీకి పాల్పడిందని ఆరోపించారు. బాలికపై కేసు నమోదు చేయాలని కోరారు. అయితే, బాలిక తల్లి ఆ ఆరోపణలను కొట్టి పడేసింది. తన కుమార్తెను వారు ఇంట్లో నిర్బంధించి హింసిస్తున్నారని, రక్షించాలని సామర్లకోట పోలీసులకు పిర్యాదు చేసింది. దీంతో బాలకార్మిక చట్టం కింద కేసు నమోదు చేసుకున్న సామర్లకోట పోలీసులు చెన్నై వెళ్లి భానుప్రియను విచారించారు. మరోవైపు, చెన్నైలో భానుప్రియ పెట్టిన కేసులో ప్రభావతి, ఆమె కుమార్తెను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని విచారించారు.

తాజాగా, ప్రభావతి పెట్టిన కేసును సామర్లకోట పోలీసులు చెన్నైకి బదలాయించారు. నేరం జరిగింది చెన్నైలో కాబట్టి అక్కడి పోలీసులకు అప్పగించారు. దీంతో చెన్నై పోలీసులు భానుప్రియ, ఆమె సోదరుడిపై మరోమారు బాలకార్మిక చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో వారిని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం.

  • Loading...

More Telugu News