Karnataka: కర్ణాటకలోని కలబురగిలో కొత్త నిబంధన ‘నో హెల్మెట్-నో పెట్రోల్’
- ఈ నెల 29 నుంచి అమల్లోకి రానున్న నిబంధన
- ఈ మేరకు పెట్రోల్ బంకులకు ఆదేశాలు
- ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించేందుకే
కర్ణాటకలోని కలబురగి కమిషనరేట్ పరిధిలో పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఇకపై హెల్మెట్ ధరించకుండా నడిపే వాహనదారులకు పెట్రోల్ లభించకుండా ఉండేలా నిర్ణయం తీసుకున్నారు.హెల్మెట్ ధరించి వాహనాలు నడిపే విధంగా ‘నో హెల్మెట్- నో పెట్రోల్’ అనే కొత్త నిబంధనను అమల్లోకి తీసుకురానున్నారు. కలబురగి కమిషనరేట్ పరిధిలోని ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించని పక్షంలో వారికి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లభించిందని, ఈ మేరకు పెట్రోల్ బంకులకు ఆదేశాలు జారీ చేసినట్టు పోలీస్ కమిషనర్ ఎంఎన్ నాగరాజు తెలిపారు. ఈ నెల 29 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని అన్నారు. వాహనదారులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించే నిమిత్తం ఇలాంటి నిబంధనను తీసుకొస్తున్నట్టు చెప్పారు.