Narendra Modi: హ్యూస్టన్ సభతో నవ చరిత: అమెరికాలో మోదీ

  • ఇది రెండు అతిపెద్ద ప్రజాస్వామ్యాల సంగమం
  • ట్రంప్ భారత్‌కు నిజమైన శ్వేతసౌధ స్నేహితుడు
  • ట్రంప్ మరోమారు అధికారంలోకి రావాలి

భారత్-అమెరికా మధ్య హ్యూస్టన్‌ నుంచి సరికొత్త స్నేహగీతం కొనసాగుతుందని భారత ప్రధాని మోదీ అన్నారు. అమెరికాలోని హ్యూస్టన్‌లో జరిగిన ‘హౌడీ-మోదీ’ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ భారీగా హాజరైన ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. భారత్‌కు నిజమైన స్నేహితుడు అమెరికా అధ్యక్షుడు ట్రంపేనని అన్నారు. ఆయనను కలిసే అవకాశాలు తనకు తరచూ లభించాయన్నారు.

ట్రంప్ చాలా స్నేహపూర్వకమైన వ్యక్తి అని, భారత్‌కు నిజమైన శ్వేతసౌధ స్నేహితుడని అన్నారు. ఇది ట్రంప్, మోదీల కలయిక కాదని, రెండు అతిపెద్ద ప్రజాస్వామ్యాల సంగమమని అభివర్ణించారు. హ్యూస్టన్ సభ నవ చరిత్రకు శ్రీకారం చుడుతుందని అన్నారు. అంతేకాదు.. త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి ట్రంప్ మరోమారు అధికారంలోకి రావాలని మోదీ అభిలషించారు. అంతకుముందు కార్యక్రమానికి హాజరైన ట్రంప్‌కు భారత విదేశాంగశాఖ మంత్రి జయశంకర్ స్వాగతం పలికారు. మోదీ వెళ్లి ట్రంప్ ను వేదికపైకి సగౌరవంగా తీసుకొచ్చారు.

  • Loading...

More Telugu News