MS Dhoni: క్రికెట్ నుంచి మరికొన్ని నెలలు విశ్రాంతి కోరుకుంటున్న ధోనీ.. సెలక్షన్‌కు దూరంగా మాజీ సారథి!
- ధోనీ రిటైర్మెంట్పై ఇటీవల ఘాటు వ్యాఖ్యలు చేసిన గవాస్కర్
- నవంబరు వరకు సెలక్షన్‌కు అందుబాటులో ఉండని ధోనీ
- నవంబరులో బంగ్లాదేశ్‌తో జరగనున్న సిరీస్‌కు కూడా ధోనీ డౌటే
టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ అభిమానులకు ఇది చేదు వార్తే. ప్రపంచకప్ తర్వాత క్రికెట్ నుంచి తాత్కాలిక విరామం తీసుకున్న ధోనీ.. ఈ ఏడాది నవంబరు వరకు సెలక్షన్‌కు అందుబాటులో ఉండడం లేదని సమాచారం. ప్రపంచకప్ తర్వాత విండీస్ పర్యటనకు దూరమైన ఎంఎస్.. స్వదేశంలో సౌతాఫ్రికా సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని భావించారు. అయితే సెలక్టర్లు షాకిస్తూ ధోనీని పక్కనపెట్టి రిషభ్ పంత్‌నే కొనసాగించారు.
నవంబరు వరకు ధోనీ అందుబాటులో ఉండడం లేదన్న సమాచారం నిజమైతే రేపటి నుంచి ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీతోపాటు నవంబరులో స్వదేశంలో జరగనున్న బంగ్లాదేశ్ సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండడన్న మాటే. కాగా, ఇటీవల ధోనీ రిటైర్మెంట్పై వచ్చిన వార్తలను స్వయంగా అతడి భార్య సాక్షి కొట్టిపారేసింది. మరోవైపు, ధోనీ రిటైర్మెంట్పై మాజీ క్రికెటర్లు స్పందిస్తూనే ఉన్నారు. ధోనీని జట్టు నుంచి గెంటేయకముందే అతడు గౌరవంగా తప్పుకోవడం మంచిదంటూ ఇటీవల టీమిండియా మాజీ సారథి సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.