Bahubali: 'బాహుబలి' లేకుంటే 'సైరా' లేదు: చిరంజీవి కీలక వ్యాఖ్యలు

  • నిన్న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్
  • పదిహేనేళ్ల క్రితమే కథ నా ముందుకొచ్చింది
  • బడ్జెట్ ఒప్పుకోదనే పక్కన బెట్టామన్న చిరంజీవి

రాజమౌళి దర్శకత్వం వహించిన 'బాహుబలి' లేకుంటే 'సైరా' లేదని మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న రాత్రి చిత్రం ప్రీ ఈవెంట్ రిలీజ్, హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో అభిమానుల కేరింతల మధ్య వైభవంగా జరిగింది.

'సైరా' సినిమా కథ, తన వద్దకు పరుచూరి బ్రదర్స్ ద్వారా వచ్చిందని, పదిహేనేళ్ల క్రితం, తనపై రూ. 40 కోట్లు ఖర్చుతో సినిమాలు తీస్తున్న రోజుల్లోనే, 'సైరా' చిత్రానికి రూ. 70 కోట్లపైనే అవుతుందన్న అంచనాలు ఉన్నాయని, అందుకే నిర్మాతలకు నష్టాలు రాకూడదన్న ఉద్దేశంతో సినిమాను పట్టాలెక్కించలేదని అన్నారు. తెలుగువాడు, తొలి స్వాతంత్ర్య సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి ప్రజలకు చెప్పాలన్న కోరిక ఉన్నా, బడ్జెట్ సమస్యతో ఆగుతూ వచ్చిందన్నారు.

'నా 151వ చిత్రంగా 'సైరా' తీయాలన్న ఆలోచన వచ్చింది. అయితే, మాకు పరోక్షంగా ప్రేరణ ఇచ్చింది మాత్రం 'బాహుబలి' సినిమాలే. ఆ సినిమాలే రాకుంటే, 'సైరా' వచ్చుండేది కాదు. వందల కోట్లు ఖర్చు చేసినా, నిర్మాతలకు నష్టం రాకుండా సంపాదించుకోవచ్చని రాజమౌళి చేసి చూపించారు. దీంతో అధిక ఖర్చు పెట్టి రిస్క్ చేయాలని మరెవరో నిర్మాతకు చెప్పే బదులు, మనమే చేద్దామని రామ్ చరణ్ అనడంతో సరేనన్నా' అని చిరంజీవి తెలిపారు.

  • Loading...

More Telugu News