Virat Kohli: కోహ్లీ ఖాతాలో మరో డీమెరిట్ పాయింటు
- కోహ్లీకి ఐసీసీ మందలింపు
- ఇప్పటికే కోహ్లీ ఖాతాలో రెండు డీమెరిట్ పాయింట్లు
- తప్పిదాన్ని అంగీకరించిన కోహ్లీ
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి దూకుడెక్కువన్న సంగతి తెలిసిందే. తాజాగా దక్షిణాఫ్రికాతో మూడో టి20 మ్యాచ్ లో ప్రత్యర్థి ఆటగాడు బ్యూరాన్ హెండ్రిక్స్ ను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టినట్టు తేలింది. కోహ్లీ కూడా తన తప్పిదాన్ని అంగీకరించడంతో మ్యాచ్ రిఫరీ మందలింపుతో సరిపెట్టాడు. అయితే ఇది ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ లెవల్ 1 తప్పిదం కావడంతో కోహ్లీ ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ చేరింది.
ఇక కోహ్లీకి ఇప్పటికే రెండు డీమెరిట్ పాయింట్లున్నాయి. రెండేళ్ల వ్యవధిలో ఓ క్రికెటర్ ఖాతాలో నాలుగు డీమెరిట్ పాయింట్లు చేరితే ఓ సస్పెన్షన్ పాయింటుగా మారుతుంది. ఆ విధంగా రెండు సస్పెన్షన్ పాయింట్లు ఉంటే సదరు ఆటగాడు ఓ టెస్టు కానీ, రెండు వన్డేలు కానీ, రెండు టి20 మ్యాచ్ లు కానీ వీటిలో ఏది ముందు వస్తే ఆ ఫార్మాట్ లో మ్యాచ్ లు ఆడకుండా నిషేధానికి గురవుతాడు.