KTR: కొత్త మున్సిపల్ చట్టం చాలా కఠినంగా ఉంటుంది!: తెలంగాణ మంత్రి కేటీఆర్
- కొత్త చట్టంపై ఉద్యోగులు అవగాహన పెంచుకోవాలి
- భవన నిర్మాణాలకు అనుమతులను సులభతరం చేస్తాం
- 75 గజాల లోపు స్థలంలో నిర్మాణాలకు అనుమతులు అవసరం లేదు
కొత్త మున్సిపల్ చట్టానికి తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన కొత్త మున్సిపల్ చట్టం చాలా కఠినంగా ఉంటుందని... తప్పులు చేసే వారికి వెన్నులో భయం పుట్టేలా ఉంటుందని చెప్పారు. కొత్త చట్టంపై ఉద్యోగులు అవగాహన పెంచుకోవాలని తెలిపారు. ఇకపై భవన నిర్మాణాలకు అనుమతులను సులభతరం చేస్తామని చెప్పారు. 75 గజాల వరకు ఉన్న స్థలంలో నిర్మాణాలకు అనుమతులు అవసరం లేదని తెలిపారు. 76 నుంచి 600 గజాల వరకు స్థలాల్లో నిర్మాణాలకు 21 రోజుల్లో అనుమతులు ఇస్తామని చెప్పారు.