Bhadradri Kothagudem District: సమ్మెబాట పట్టిన తెలంగాణ బొగ్గుగనుల కార్మికులు... నిలిచిన ఉత్పత్తి!

  • జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు నిర్ణయం
  • పలుచోట్ల గనుల్లో నిలిచిన ఉత్పత్తి
  • భద్రాద్రి కొత్తగూడెంలో పూర్తి ప్రభావం

జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోని బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికులు సమ్మెబాట పట్టడంతో పలు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గనుల్లో పూర్తి ప్రభావం కనిపిస్తుండగా, ఉపరితల గనుల్లో పాక్షిక ప్రభావం కనిపిస్తోంది.

బొగ్గు గనుల్లోకి నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తూ కేంద్రం తీసుకుంటున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాలు పోరాడుతున్న విషయం తెలిసిందే. జాతీయ సంఘాలతోపాటు టీబీజీకేఎస్‌ సమ్మెలో పాల్గొంటున్నాయి. కార్మికుల సమ్మె కారణంగా రామగుండం ఆర్‌బీ 1, 2, 3 రీజియన్‌లోని ఏడుగనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. అలాగే మందమర్రిలోని భూగర్భ, ఉపరితల గనుల్లో కార్మికులు కూడా సమ్మె బాటపట్టారు.

  • Loading...

More Telugu News