south central railway: అదో మొక్కుబడి సమావేశం...అందుకే బయటకు వచ్చేశా: కేశినేని నాని

  • రైల్వే జీఎంతో సమావేశం నుంచి మధ్యలోనే నిష్క్రమణ
  • అంతా తూతూమంత్రమేనని ఆరోపణ
  • ఏ విజ్ఞప్తి చేసినా పట్టించుకునే దాఖలాలు లేవు

రాష్ట్ర స్థాయిలో అవసరాలు, సమస్యలపై ప్రతి ఏడాది స్థానిక ఎంపీలతో కేంద్ర రైల్వేశాఖ నిర్వహించే సమావేశం మొక్కుబడి తంతు అని, అక్కడ ఎంపీలు చేసిన విజ్ఞప్తులేవీ పట్టించుకోరని విజయవాడ ఎంపీ కేశినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్ర ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజనాన్‌ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి నానితోపాటు మొత్తం 17 మంది రాష్ట్ర ఎంపీలు హాజరయ్యారు. అయితే ఈ సమావేశం నుంచి కాసేపటికే నాని బయటకు వచ్చేశారు.

అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఇదో తూతూ మంత్రంగా నిర్వహించే సమావేశమన్నారు. గతంలో జరిగిన సమావేశాల్లో కొత్త రైళ్లు, కొత్త లైన్లు, ఇంకా ఎన్నో ప్రాజెక్టుల గురించి విజ్ఞప్తి చేసినా ఒక్కదాన్నీ పట్టించుకున్న దాఖలాల్లేవన్నారు. పైగా తాజాగా విశాఖ రైల్వే జోన్‌ పరిధిని తగ్గించేశారని ధ్వజమెత్తారు. అటువంటప్పుడు ఈ సమావేశాలు నిర్వహించడం ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సమన్వయం చేసి మన ప్రాజెక్టులు ముందుకు సాగేలా చూడాలని కోరారు.

  • Loading...

More Telugu News