Adimulapu Suresh: పేరెంట్స్ కమిటీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఫలితాలు: మంత్రి ఆదిమూలపు సురేశ్
- పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్టు వెల్లడి
- ఒకే రోజు 96 శాతం కమిటీల ఎన్నిక పూర్తయిందన్న మంత్రి
- విద్యాహక్కు అమలుకు కమిటీలు తోడ్పతాయని వ్యాఖ్యలు
పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీ ఎన్నికల్లో పలు చోట్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు. పాఠశాలల్లో ప్రశాంత వాతావరణంలో పేరెంట్స్ కమిటీ ఎన్నికలు నిర్వహించినట్టు తెలిపారు. పేరెంట్స్ కమిటీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఫలితాలు వచ్చాయని చెప్పారు.
రాష్ట్రంలో 46,612 పాఠశాలల్లో విద్యాశాఖ ఎన్నికలు నిర్వహించిందని, ఒకే రోజు 96 శాతం పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీ ఎన్నిక పూర్తయిందని మంత్రి వివరించారు. 63 శాతం పాఠశాలల్లో ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయని, 33 శాతం పాఠశాలల్లో ఓటింగ్ ద్వారా ఎన్నికలు నిర్వహించినట్టు వెల్లడించారు. విద్యాహక్కు చట్టం పకడ్బందీగా అమలు చేసేందుకు ఈ కమిటీలు తోడ్పతాయని అన్నారు.