Supreme Court: నిందితుల స్థిరాస్తుల స్వాధీనం విషయంలో కీలక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు
- బాంబే హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం
- ఆస్తులను అటాచ్ చేసే అధికారం పోలీసులకు లేదన్న సుప్రీం
- 102 సెక్షన్ ప్రకారం ఇది ఆమోదయోగ్యం కాదన్న ధర్మాసనం
క్రిమినల్ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తుల ఆస్తులను అటాచ్ చేసే అధికారం పోలీసులకు లేదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. నిందితులకు సంబంధించిన స్థిరాస్తులను పోలీసులు స్వాధీనం చేసుకోరాదని, సీఆర్పీసీ సెక్షన్ 102 ప్రకారం ఇది ఆమోదయోగ్యం కాదని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.
ఆస్తులను అటాచ్ చేసే అధికారం పోలీసులకు లేదని బాంబే హైకోర్టు ఓ కేసులో పేర్కొనగా, దాన్ని సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై ఇవాళ విచారణ జరిపిన సుప్రీంకోర్టు తాజా తీర్పు వెలువరించింది.