Sensex: రెండు రోజుల భారీ ర్యాలీ తర్వాత ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు
- లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు
- 7 పాయింట్ల స్వల్ప లాభంతో ముగిసిన సెన్సెక్స్
- 12 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
రెండు రోజుల భారీ ర్యాలీ తర్వాత ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. ఇన్వెస్టర్లు ఈరోజు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో, ఉదయం నుంచి సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 7 పాయింట్ల స్వల్ప లాభంతో 39,097కి పెరిగింది. నిఫ్టీ 12 పాయింట్లు నష్టపోయి 11,588 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇన్ఫోసిస్ (3.78%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (3.22%), టెక్ మహీంద్రా (3.12%), టాటా మోటార్స్ (2.35%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (1.59%).
టాప్ లూజర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-3.56%), యాక్సిస్ బ్యాంక్ (-3.13%), ఎల్ అండ్ టీ (-3.03%), హీరో మోటో కార్ప్ (-2.42%), ఓఎన్జీసీ (-2.06%).