Kamma Rajyamlo Kadapa Redlu: ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రం నుంచి ‘చంపేస్తాడు.. బాబు చంపేస్తాడు’ పాట విడుదల

  • ‘ఏయ్.. ఏసెయ్ రా నా కొడుకుని..’ అంటూ మొదలైన వీడియో  
  • ఈ వీడియోలో వర్మ వ్యాఖ్యానం
  • ‘ఈ పాట విని ఆనందించకండి’ అన్న వర్మ

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలోని ఓ పాటను చిత్రం యూనిట్ విడుదల చేసింది. ‘ఏయ్.. ఏసెయ్ రా నా కొడుకుని.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అంటూ మొదలైన ఈ వీడియోలో వర్మ వ్యాఖ్యానం ఉంది.

‘మన కళ్ల ముందే జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూస్తుంటే.. నిజమా? కలా? అని సందేహపడుతూ ముక్కు మీద వేలేసుకోక తప్పట్లేదు. రాజకీయ నాయకుల ఆత్మహత్యలు.. అత్యంత ప్రజాదరణతో గెలిచిన ఇప్పటి ముఖ్యమంత్రిని ‘టెర్రరిస్టు’తో పోలుస్తున్న అప్పటి ముఖ్యమంత్రి. ఏమిటీ వైపరీత్యం? ఏమిటీ రాష్ట్రం? ఎక్కడికి పోతోంది మన దేశం?... ఈ విపత్కర పరిస్థితులకు కారణం కమ్మ రాజ్యంలోకి కడప రెడ్లు రావడం. ఒక మనిషి అహాన్ని దెబ్బతీస్తే అతను ఎంత ఎక్స్ ట్రీమ్ కు వెళతాడోనన్న ఆలోచనలో నుంచి వచ్చిందే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’లోని ఈ పాట. విని ఆనందించకండి’ అని వర్మ వ్యాఖ్యానించారు.

‘మనిషి చెంప మీద కొడితే తట్టుకోగలడు.. కాళ్ల మధ్య తంతే నిలదొక్కుకో గలడు.. కానీ, అహం మీద కొడితే..చంపేస్తాడు..బాబు చంపేస్తాడు’ అంటూ ఈ పాట కొనసాగింది. ఈ పాట కొనసాగుతున్నంత సేపు టీడీపీ, వైసీపీ నేతల చిత్రాలు కనపడతాయి. ఈ చిత్రం పూర్తిగా కల్పిత పాత్రలతో ఉన్న కల్పిత కథ అని వర్మ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఆ పాత్రలను నిజజీవిత పాత్రలతో పోల్చడం యాదృచ్చికం అని, సత్య హరిశ్చంద్రుడిపై ప్రమాణం చేసి చెబుతున్నానని వర్మ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News