Telugudesam: వాల్తేరు డివిజన్ లేకుండా రైల్వే జోన్ ఇవ్వడంలో అర్థం లేదు: ఎంపీ కేశినేని నాని
- ఏపీ ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జీఎం సమావేశం
- పెండింగ్ ప్రాజెక్టులు, పనులు వెంటనే ప్రారంభించాలి
- రైల్వే జీఎంకు ఓ వినతిపత్రం సమర్పించా
ఏపీకి చెందిన ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజనాన్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న టీడీపీ ఎంపీ కేశినేని నాని కొద్ది సేపటికే బయటకొచ్చేసిన విషయం తెలిసింది. గతంలో జరిగిన సమావేశాల్లో కొత్త రైళ్లు, కొత్త లైన్లు, ఇంకా ఎన్నో ప్రాజెక్టుల గురించి విజ్ఞప్తి చేసినా ఒక్కదాన్నీ పట్టించుకున్న దాఖలాలు లేవని నిరుత్సాహం వ్యక్తం చేసిన నాని, తాజాగా ఓ ట్వీట్ చేశారు.
వాల్తేరు డివిజన్ లేకుండా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఇవ్వడంలో అర్థం లేదని ఈ సమావేశంలో స్పష్టం చేశానని అన్నారు. అలాగే, విజయవాడకు సంబంధించి అనేక పెండింగ్ ప్రాజెక్టులు, పనులు వెంటనే ప్రారంభించాలని కోరుతూ ఓ వినతిపత్రం సమర్పించినట్టు నాని పేర్కొన్నారు.