Anantapur District: అనంతపురం జిల్లాలో భారీ వర్షం.. మట్టిపెళ్లలు విరిగిపడి చిన్నారి మృతి
- సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షం
- ధ్వంసమైన పంటలు
- ఊర్లోకి కొట్టుకొచ్చిన భారీ కొండచిలువ
అనంతపురం జిల్లాలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. భారీ వర్షానికి వేరుశనగ, పత్తి, కంది, మొక్కజొన్న, కొర్ర, ఆముదం, జొన్న పంటలు ధ్వంసమయ్యాయి. గుత్తిజెండా వీధిలో కప్పల వర్షం కురవడంతో జనం ఆశ్చర్యంగా చూశారు.
ఇక ఈ భారీ వర్షాలకు భారీ కొండ చిలువ ఒకటి గ్రామంలోకి కొట్టుకొచ్చింది. దీంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. పెద్దవడుగూరులో నిద్రిస్తున్న చిన్నారి వైష్ణవిపై మట్టిపెళ్లలు విరిగిపడడంతో మృతి చెందింది. యాడికి మండలంలోని గుడిసెల, చెండ్రాయునిపల్లి గ్రామాలు పూర్తిగా నీటమునిగాయి. 1500లకు పైగా చేనేత మగ్గాలు వరదలో మునిగిపోగా, వేములపాడులో 200 గొర్రెలు నీటిలో కొట్టుకుపోయాయి.