Krishna District: 'అమ్మానాన్నలు నన్ను వేధిస్తున్నారు' అంటూ పోలీసులను ఆశ్రయించిన 12 ఏళ్ల బాలుడు
- హీటర్‌తో తన ఒంటిపై గాయాలు చేస్తున్నారని ఆవేదన
- తల్లిదండ్రులను పిలిచి విచారించిన పోలీసులు
- చదువుకోమని చెబితే ఇలా చేస్తున్నాడని వివరణ
తల్లిదండ్రులు తనను నిత్యం వేధిస్తున్నారంటూ ఓ పన్నెండేళ్ల విద్యార్థి పోలీసులను ఆశ్రయించడం స్థానికంగా సంచలనమైంది. వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఓ బాలుడు (12) ఆర్.పేట పోలీస్ స్టేషన్‌కు వచ్చి తనను తల్లిదండ్రులు వేధిస్తున్నారని చెప్పాడు. ఇప్పుడు కూడా హీటర్‌తో తన ఒంటిపై వాతలు పెడుతుంటే తప్పించుకుని స్టేషన్‌కి వచ్చానని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాడు.
తొలుత ఆశ్చర్యపోయిన పోలీసులు అనంతరం ఆ ఫిర్యాదులో ఎంత వాస్తవం ఉందో తెలుసుకునేందుకు తల్లిదండ్రులను పిలిపించి వారి వివరణ కోరారు. బుద్ధిగా చదువుకోమని పదేపదే చెబుతుండడంతో బాలుడు ఈ ట్రిక్ ప్లే చేశాడని గ్రహించి బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం తల్లిదండ్రులతో పంపించేశారు.