Rohith: జీవితమంటే ఏమిటో అప్పుడే తెలిసింది: హీరో రోహిత్
- సక్సెస్ - ఫెయిల్యూర్ చూశాను
- అప్పట్లో ఎవరినీ కేర్ చేసేవాడిని కాదు
- ఫెయిల్యూర్ పాఠాలు నేర్పిందన్న రోహిత్
కొంతకాలం క్రితం ప్రేమకథా చిత్రాలతో అలరించిన రోహిత్ ను ఆ తరువాత వరుస పరాజయాలు పలకరించాయి. దాంతో అవకాశాలు తగ్గుతూ రేసులో ఆయన వెనకబడుతూ వచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "సక్సెస్ - ఫెయిల్యూర్ ఈ రెండూ కూడా నా జీవితంలో నాకు చాలానే నేర్పాయి.
సక్సెస్ లో వున్నప్పుడు నా మైండ్ సెట్ వేరేగా ఉండేది. ఎవరినీ కేర్ చేసేవాడిని కాదు. నేను చెప్పిందే కరెక్ట్ .. చేసేదే కరెక్ట్ అన్నట్టుగా ఉండేవాడిని. నేను చెప్పినట్టుగానే అంతా చేయాలి అని అనుకునేవాడిని. ఫెయిల్యూర్స్ వరుసగా రావడం మొదలయ్యాక లైఫ్ అంటే ఏమిటో తెలిసింది. ఫెయిల్యూర్స్ రావడం వలన కెరియర్లో గ్యాప్ వచ్చింది. అప్పుడు కష్టం అంటే ఎలా వుంటుందనే విషయం అర్థమైంది. కష్టపడితే సక్సెస్ వస్తుందని అంటారు .. కానీ ఆ కష్టానికి అదృష్టం కూడా తోడు కావాలనేది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను" అని చెప్పుకొచ్చాడు.