Facebook: ఫేస్‌బుక్‌లో అశ్లీల చిత్రాలు పోస్టు చేస్తూ డబ్బులు దండుకుంటున్న యువతి అరెస్ట్

  • పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, తల్లిదండ్రులే లక్ష్యం
  • ఫొటోలు డౌన్‌లోడ్ చేసి మార్ఫింగ్
  • వాటిని చూపించి బెదిరింపులు

ఫేస్‌బుక్‌లో అసభ్య చిత్రాలు పోస్టు చేసి బెదిరించి డబ్బులు గుంజుతున్న యువతి నేహా ఫాతిమా (21)కి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిన్న అరదండాలు వేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పాతబస్తీ సంతోష్ నగర్‌కు చెందిన ఫాతిమా బీకాం కంప్యూటర్స్ పూర్తిచేసి ఖాళీగా ఉంటోంది.

ఈ క్రమంలో సులభంగా డబ్బులు సంపాదించేందుకు ప్లే స్కూల్ ప్రిన్సిపాల్ పేరుతో ఫేస్‌బుక్ ఖాతా తెరిచింది. వివిధ పాఠశాలల ఫేస్‌బుక్ ఖాతాల్లోని ఫొటోలు, వీడియోలను డౌన్‌లోడ్ చేసుకుంది. రెండు వారాల క్రితం రెండు ప్రైవేటు పాఠశాలల ఫేస్‌బుక్ ఖాతా నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఫొటోలను డౌన్‌లోడ్ చేసి వాటిని మార్ఫింగ్ చేసి తిరిగి వారి ఖాతాల్లో అప్‌లోడ్ చేసింది.

మొత్తం 15 పాఠశాలల ఫేస్‌బుక్ ఖాతాల్లో ఇలా మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలను అప్‌లోడ్ చేసింది. ఇటీవల ఓ పాఠశాల ప్రిన్సిపాల్‌కు ఫోన్ చేసి తనను తాను ఐటీ నిపుణురాలిగా పరిచయం చేసుకుంది. తన పేరు సైరా జోసెఫ్ అనీ, వారి ఫేస్‌బుక్ ఖాతాలో అప్‌లోడ్ అయిన అశ్లీల చిత్రాలను తొలగించాలంటే వేల రూపాయలు ఖర్చవుతుందని చెప్పింది. ఇవ్వకుంటే మరిన్ని పోస్టులు వస్తాయని బెదిరించింది.

దీంతో ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పక్కా ఆధారాలతో ఫాతిమాను అదుపులోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో ఆమెను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నట్టు అడిషనల్ డీసీపీ రఘువీర్ తెలిపారు.

  • Loading...

More Telugu News