arabian sea: తెలుగు రాష్ట్రాలపైకి దూసుకొస్తున్న ‘హికా’ తుపాను
- అరేబియా తీరంలో గంటకు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు
- మత్స్యకారులు చేపల వేటకు వెళ్లద్దని హెచ్చరికలు
- వచ్చే 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాలపైకి ‘హికా’ తుపాను దూసుకొస్తోంది. ఇప్పటికే ఎడతెరిపిలేని వర్షాలతో అతలాకుతలం అవుతున్న తెలుగు రాష్ట్రాలకు ఇది పిడుగులాంటి వార్తే. తుపాను ప్రభావంతో అరేబియా తీరంలో గంటకు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. అలాగే, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళలోనూ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్, విదర్భ, రాజస్థాన్, చత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో కుండపోత వాన కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.