Andhra Pradesh: ఏపీ ప్రజలకు వైసీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. వచ్చే నెల 10 నుంచి ‘వైఎస్సార్ కంటి వెలుగు’
- మొత్తం ఐదు దశల్లో పథకం నిర్వహణ
- తొలి రెండు దశల్లో విద్యార్థులకు
- కమ్యూనిటీ బేస్ ఆధారంగా చివరి మూడు దశలు
వచ్చే నెల 10వ తేదీ నుంచి ఏపీలో వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఐదు దశల్లో అమలు చేయనున్న ఈ పథకంలో భాగంగా ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. తొలి రెండు దశల్లో పాఠశాల విద్యార్థులకు, తర్వాతి దశల్లో కమ్యూనిటీ బేస్ ఆధారంగా పరీక్షలు చేస్తారు. పథకంలో భాగంగా స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, కేటరాక్ట్ ఆపరేషన్‌లతోపాటు అవసరమైన పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పథకం పర్యవేక్షణకు జిల్లా కలెక్టర్లు చైర్మన్‌గా టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.