Sensex: ట్రంప్ వ్యాఖ్యలతో జోష్.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- చైనాతో వాణిజ్య యుద్ధానికి ముగింపు పలుకుతామన్న ట్రంప్
- 396 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 131 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
వరుసగా రెండు రోజుల పాటు నష్టాలను మూటగట్టుకున్న దేశీయ మార్కెట్లు నేడు పుంజుకున్నాయి. చైనాతో వాణిజ్య యుద్ధానికి ముగింపు పలుకుతామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 396 పాయింట్లు పెరిగి 38,990కి ఎగబాకింది. నిఫ్టీ 131 పాయింట్లు పెరిగి 11,571కి చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
వేదాంత లిమిటెడ్ (6.47%), మహీంద్రా అండ్ మహీంద్రా (6.00%), ఓఎన్జీసీ (4.15%), ఐసీఐసీఐ బ్యాంక్ (4.05%), టాటా స్టీల్ (3.85%).
టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-4.93%), ఇన్ఫోసిస్ (-1.28%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.67%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.62%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-0.26%).