INS Khanderi: భారత్ అమ్ములపొదిలో మరో భీకర అస్త్రం... నేవీకి అప్పగించనున్న రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్
- విధి నిర్వహణకు ఉరకలేస్తున్న ఖండేరీ సబ్ మెరైన్
- ఈ 28న నేవీకి అప్పగించనున్న రాజ్ నాథ్
- పటిష్టం కానున్న భారత నావికాదళం
సముద్ర తీర ప్రాంతం ఉన్న దేశానికి భద్రత పరంగా పదాతి, వాయుసేనతో పాటు నావికాదళం కూడా ఎంతో కీలకం. భారత్ కూడా తన నావికాదళాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు అత్యాధునిక జలాంతర్గాములను సమకూర్చుకుంటోంది. దేశీయంగానూ తయారుచేస్తోంది. తాజాగా, ఐఎన్ఎస్ ఖండేరీ సబ్ మెరైన్ అన్ని హంగులు పూర్తిచేసుకుని విధి నిర్వహణ కోసం సర్వసన్నద్ధమైంది. ఇది రెండో కల్వరీ క్లాస్ సబ్ మెరైన్. ఈ నెల 28న ముంబయిలో జరిగే ఓ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఖండేరీని నేవీకి అప్పగిస్తారు. ఆపై గోవా వెళ్లి విమాన వాహకనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై ఓ రోజు గడపనున్నారు.