Telangana: ఈ వర్షాలకు తుపాను కారణం కాదు: వాతావరణ శాఖ

  • కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
  • మరో మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు
  • ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ మీదుగా కొనసాగుతున్న ద్రోణి

తుపాను ప్రభావంతోనే ప్రస్తుతం వానలు కురుస్తున్నాయన్న వార్తల్లో నిజం లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ మహారాష్ట్ర, దానిని ఆనుకుని ఉన్న గోవా, కర్ణాటక, తూర్పు మధ్య అరేబియా సముద్ర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఈ కారణంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ మీదుగా బీహార్ వరకు ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు, తుపానుకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News