Sensex: ఉదయం నుంచి మార్కెట్ల ఊగిసలాట.. చివరికి నష్టాల్లో ముగింపు
- లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు
- 167 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 58 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈనాటి ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. లాభనష్టాల మధ్య కొట్టుమిట్టాడాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో చివరకు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 167 పాయింట్లు నష్టపోయి 38,822కి పడిపోయింది. నిఫ్టీ 58 పాయింట్లు కోల్పోయి 11,512కు దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (1.61%), భారతి ఎయిర్ టెల్ (1.41%), ఐటీసీ (1.28%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (0.94%), కొటక్ మహీంద్రా (0.91%).
టాప్ లూజర్స్:
వేదాంత లిమిటెడ్ (-5.39%), యస్ బ్యాంక్ (-4.41%), టాటా స్టీల్ (-4.40%), ఓఎన్జీసీ (-4.13%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-4.12%).