hyderabad business school: వరల్డ్ టాప్-100 బిజినెస్ స్కూల్స్ జాబితాలో ఐ.ఎస్.బి
- కోల్‌కతా, ముంబయి ఇనిస్టిట్యూట్‌లను వెనక్కినెట్టి ఘనత
- వందలో చోటు దక్కించుకున్న అహ్మదాబాద్ ఐఐఎం, బెంగళూరు ఐఐఎం
- మొదటి ఏడు స్థానాలు అమెరికా విద్యా సంస్థలవే
హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచంలోని వంద అత్యుత్తమ బిజినెస్ స్కూల్స్ జాబితాలో చోటు దక్కించుకుని ప్రపంచాన్ని ఆకర్షించింది. ఈ జబితాలో చోటు దక్కించుకున్న భారతీయ బిజినెస్ స్కూల్‌లు అహ్మాదాబాద్, బెంగళూరులోని ఐఐఎంలు మాత్రమే కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే...ప్రపంచంలోని ఐఐఎం, ఐఎస్‌బీల్లో ప్రమాణాల ఆధారంగా ‘క్యూఎస్ గ్లోబల్ ఫుల్‌టైం ఎంబీఏ ర్యాంకింగ్స్ -2020’ తాజాగా విడుదల చేసిన జాబితాలో ఐఎస్‌బీ 98వ స్థానంలో నిలిచింది.
అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) 40వ స్థానం దక్కించుకుంది. దేశంలోని అగ్రశ్రేణి బిజినెస్ స్కూల్స్‌లో అహ్మదాబాద్ ఐఐఎందే మొదటి స్థానం. ఇక బెంగళూరులోని ఐఐఎం (ఐఐఎం-బీ) 44వ స్థానంలో నిలిచింది.
దేశంలోని ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూల్స్‌గా గుర్తింపు పొందిన ఐఐఎం కోల్‌కతా, ముంబయికి చెందిన ఎస్పీ జైన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చి ప్రపంచంలోని టాప్ 100-250 మధ్య జాబితాలో చోటు దక్కించుకున్నాయి. కాగా వరల్డ్ టాప్-100 జాబితాలోని మొదటి ఏడు స్థానాలు అమెరికాలోని విద్యా సంస్థలవే కావడం గమనార్హం.